back

ఎన్.టీ.ఆర్ ఆడియోకి బాలక్రిష్ణ చిరంజీవిని పిలిచారా ..?



Share via:

బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ‘కథానాయకుడు’ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతి 9న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను నేడు నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు నందమూరి ఫ్యామిలీ మొత్తం... జూనియర్ ఎన్టీఆర్ తో సహా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోలు మరియు ప్రముఖులు ఎంతో మందిని బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించాడట. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు లను స్వయంగా ఆహ్వానించిన బాలక్రిష్ణ, మరి తన ప్రియ స్నేహితుడు చిరంజీవిని ఆహ్వానిన్చాడా లేదా అనేది తెలియట్లేదు.


అయితే రాజకీయ కారణాల వల్ల చిరంజీవిని ఈ కార్యక్రమంకు ఆహ్వానించడం లేదని ఒక వర్గం వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ఉంటుందని మొదట ప్రచారం జరిగినా ఆ పాత్రను బాలయ్య వద్దని దర్శకుడికి చెప్పడంతో తీసేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరంజీవికి ఆహ్వానం అందలేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పిలిచినా బదాని ప్రాంతంలో సైరా షూటింగ్లో ఉన్న చిరంజీవి వెళ్తారా అనేది కూడా ఒక సందేహమే..

Tags : NTR Biopic, Nandamuri Balakrishna, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel