back

#RRR గురించి సరికొత్త అప్డేట్..!



Share via:

ఏ ముహూర్తాన రాజమౌళి #RRR ప్రాజెక్ట్ అనౌన్సు చేసాడో, అప్పటినించి ఈ సినిమా గురించి రకరకాల వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. రామచరణ్-ఎన్టిఆర్ కాంబో లో రాజమౌళి తీయబోయే ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా సినీ అభిమానులలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనిని కాష్ చేసుకోడానికి ఈ మధ్య కాలంలో ఇబ్బడిముబ్బడి గా వచ్చేసిన యుట్యూబ్ చానల్స్ రకరకాల హెడ్డింగ్స్ తో జనాలకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలీకుండా చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న కొత్త వార్త ఏంటంటే...

“రాజమౌళి ఆధ్వర్యంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నవంబర్ నుండి ఈ చిత్ర వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది”

అన్ని సినిమాలకు ఇలాగే వర్క్ షాప్ లో రిహార్సల్స్ చేయడం, చేపించడం రాజమౌళికి అలావాటే కాబాట్టి , ఈ వార్తని నమ్మచ్చు. అలాగే ఈ సినిమా గురించి మరికొన్ని వార్తలు ఏంటంటే..

ఈ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగుతుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్ నేపధ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవేనని చెప్తున్నారు. ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే నని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ కూడా ఒక డ్రాఫ్ట్ పూర్తయింది. ప్రస్తుతం ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

Tags : #RRR Movie, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel