back

తారక్ ని మిస్ అవుత -చరణ్



Share via:

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ ‘RRR’లో వీరిద్దరూ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా గురించి రామ్ చరణ్ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో తన తోటి నటుడు, స్నేహితుడు ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

తన స్నేహితుడు ఎన్టీఆర్‌తో తెరను పంచుకోనుండటం ఎంతో సంతోషంగా ఉందని చరణ్ అన్నారు. ‘‘ఉత్తరాంధ్రకు అల్లూరి సీతారామరాజు ఏం చేశారో.. తెలంగాణలో కొమరం భీమ్ అదే చేశారు. ఆ పాత్ర పోషిస్తోన్న తారక్ ఒక ఫైర్‌క్రాకర్. అతనిలో బోలెడంత ఎనర్జీ ఉంది. అతను సెట్‌లో ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది. ఒకవేళ అతను సెట్‌లో లేకపోతే నేను చాల మిస్ అవుతాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు నుంచే మేమిద్దం స్నేహితులం. మేమిద్దం కలిసి నటించడానికి ఈ స్నేహం సాయపడింది. ఈ ప్రయాణం చాల గొప్పగా సాగుతోంది’’ అని చరణ్ చెప్పుకొచ్చారు

Tags : RRR, Ram charan, Rajamouli, Tarak, Jr NTR

Write a comment ...
Post comment
Cancel