back

చిరంజీవి - కొరటాల సినిమా హీరోయిన్ ఆమేనా ..?



Share via:

సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమా విషయాన్ని పూర్తిగా దర్శకుడు కొరటాల శివ కే వదిలేసాడు. సినిమా కోసం కావాల్సిన ప్రతి విషయము తనే ఫైనల్ చేస్తున్న శివ ఇప్పుడు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. అయితే మెగాస్టార్ కి హీరోయిన్ సమస్య మాత్రం ప్రతి సినిమాకి రిపీట్ అవుతోనే ఉంది.

ప్రస్తుతం చిరంజీవి ముందు శ్రియ - అంజలి - అనుష్క మినహా పెద్దగా ఛాయస్ లేరు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదంటే మళ్లీ కాజల్ ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. సోషల్ మీడియాలో ఆ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యాడంట.

కాలా సినిమా రజినీకాంత్ స్నేహితురాలిగా నటించిన హ్యూమా ఖురేషి ని ప్రాతమిఖంగా డిసైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.అందంతో పాటు ప్రతిభ ఉండే హ్యుమ ఖురేషీ తప్పకుండా చిరంజీవి 152వ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కొరటాల భావిస్తున్నాడట. మరి సంక్రాంతికి ముహూర్తం పెట్టుకున్న ఈ సినిమా హీరోయిన్ విషయం ఆ సమయానికన్నా అధికారికంగా చెప్తారేమో చూడాలి.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva, Huma Qureshi

Write a comment ...
Post comment
Cancel