back

రామ్ చరణ్ కోసం అన్నపూర్ణలో సిద్ధమైన భారీ సెట్



Share via:

పాటల కోసం భారీ సెట్టింగ్ లు వేసే బోయపాటి శ్రీనివాస్ తన ‘వినయ విధేయ రామ’ కి కూడా లాంటి సెట్ ఒకటి అన్నపూర్ణ స్టూడియో లో సిద్ధం చేసాడు. ఒక పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో మిగిలిన ఒక పాట రామ్ చరణ్ RRR మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే తీయనున్నారు.

సంక్రాంతి కి రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా కోసం ఒక భారీ ప్రచార ప్రోగ్రాంని డిసెంబర్ నెలాఖరున హైదరాబాద్ లో కాని వైజాగ్ లో కాని నిర్వహించాలని సినిమా యూనిట్ ప్రయత్నిస్తుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పాటలు కూడా డిసెంబర్ మొదటి వారం నుంచి రిలీజ్ అవనున్నాయి.

Tags : VVR, Vinaya Vidheya Rama, Ram Charan, Annapurna Studios

Write a comment ...
Post comment
Cancel