back

జార్గియా చేరుకున్న సైరాShare via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి కీలక సన్నివేశాల కోసం జార్జియా చేరుకుంది. ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసి౦దే.

నిన్ననే జార్జియా చేరుకున్న సైరా టీం... ఈ ఉదయం షూటింగ్ ని మొదలుపెట్టింది. ఈ 40 రోజుల షెడ్యూల్ ని అత్యంత భారి వ్యయంతో తీస్తున్నారు. కేవలం ఈ ఒక్క షెడ్యూల్ కోసమే మూవీ టీం 50 కోట్ల మేర కర్చు చేయ్యబోతున్నట్టు సమాచారం.

ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం యు.ఏ.ఈ షెడ్యూల్ కోసం 80 కోట్ల మేర కర్చు చేసారు. ఇక ఆ తరువాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక షెడ్యూల్ కోసం అత్యంత భారీగా కర్చు చెయ్యడంలో సైరా రెండవ స్థానంలో నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రన్ని 200 కోట్ల మేర బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2019 వేసవి కానుకగా విడుదల చెయ్యబోతున్నారు.

Tags : Sye Raa Narasimha Reddy, Georgia Schedule, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel