back

సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొణిదల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ నెల 7వ తేది నుంచి హైదరాబాద్ గోల్కొండ శివార్లులో మరియు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్టింగ్లో 45 రోజుల పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సినిమాలో హైలైట్ గా నిలిచే యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఈ షెడ్యూల్ లోనే షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా నరసింహారెడ్డి అనుచరులతో బ్రిటిష్ పాలకులపై గన్నులు.. ఆయుధాలతో దాడికి దిగే సీన్లు ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. తమిళ హీరో 'విజయ్ సేతుపతి' ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అతడిపైనా కొన్ని మేజర్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

చిరంజీవి తరవాతి చిత్రం ఎప్పుడో తెలుసా? ఇక్కడ చుడండి...

ఈ షెడ్యూల్ కి సంబంధించి హాలీవుడ్ మూవీస్ కి పని చేసిన టెక్నీషియన్సని పిలిపించారు ప్రొడక్షన్ టీం. ఎక్కడ కూడా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కి తగ్గకూడదు అని కష్టపడుతుంది సినిమా యూనిట్.

సైరాలో మెరవనున్న మెగా ఫ్యామిలీ ఇక్కడ చుడండి...

Tags : Syeraa Narasimha Reddy, Megastar Chiranjeevi, Hollywood Technicians For Syeraa

Write a comment ...
Post comment
Cancel