back

వరుణ్ తేజ్ ని విలన్ చేస్తున్న హరీష్ ..?



Share via:

గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పెద్దగా విజయాలు లేని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు ఒక కొత్త సినిమా ప్లాన్ చేసారు. ఆ సినిమానే తమిళ్ లో భారీ హిట్ అయిన “జిగార్తాండ”.

డార్క్ కామెడీ కాన్సెప్ట్ తో అద్భుతమైన కథనంతో తమిళంలో భారీ విజయం సాధించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మరియు బాబి సింహ ముఖ్య పాత్రలు చేసారు. ఈ సినిమాలో బాబి చేసిన నెగటివ్ షేడ్స్ తో ఉండే విలన్ లాంటి పాత్రని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేయించాలని హరీష్ శంకర్ డిసైడ్ అయిపోయాడు. మరి దీనికి వరుణ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

ఈ సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ నటించిన ‘అంతరిక్షం’ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ ‘ఎఫ్2’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. F2 కి కూడా దిల్ రాజే నిర్మాత.

Tags : Varun Tej, Harish Shankar, Villain

Write a comment ...
Post comment
Cancel