back

కొత్త హంగులతో నిహారిక సినిమా



Share via:

బుల్లితెర మీద తన చలాకి తనంతో అందరిని ఆకట్టుకున్న నాగబాబు కూతురు నిహారికకు వెండి తెర అరంగేట్రం మాత్రం నిరుత్సాహపరిచింది. తన మొదటి సినిమా అయిన ‘ఒక మనసు’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నిహారిక తీస్తున్న సినిమా “హ్యాపీ వెడ్డింగ్”. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేస్తుండగా, నిహారిక జంటగా సుమంత్ అశ్విన్ చేస్తున్నాడు. శక్తికాంత్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ప్యాకెట్ సినిమా వారు నిర్మిస్తున్నారు.

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోషూట్

చాలా సింపుల్ గా స్టార్ట్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు కొత్త హంగులు జోడవుతున్నాయి, అదే ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని సమర్పిస్తుండగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తుండడం. ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

సైరాలో నిహారిక కొణిదెల...

Tags : Niharika Konidela, Happy Wedding

Write a comment ...
Post comment
Cancel