back

మెగా బ్రదర్ నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు



Share via:

మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య అవ్వడంతో మెగా బ్రదర్ గా అందరికీ సుపరిచితుడైన కొణిదెల నాగబాబు గారి పుట్టిన రోజు ఈ రోజు.

చిరంజీవి తమ్ముడు అన్న బ్రాండ్‌తో చిత్రసీమలో ప్రవేశించినా, నేడు తనదైన పంథాలో పయనిస్తున్నారు నాగబాబు. తన అన్న హీరోగా రూపొందిన 'రాక్షసుడు'తో తొలిసారి నాగబాబు తెరపై కనిపించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోగానూ అలరించారు. ఇప్పుడు కేరెక్టర్ యాక్టర్‌గా సాగుతున్నారు నాగబాబు. చిరంజీవి తన తల్లి అంజనా దేవి పేరున 'అంజనా ప్రొడక్షన్స్' పతాకం నెలకొల్పగా ఆ బ్యానర్‌కు నాగబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సోదరుల తొలి ప్రయత్నంగా తెరకెక్కిన 'రుద్రవీణ' చిత్రం అవార్డులు సొంతం చేసుకుంది. ఆ తరువాత చిరంజీవితో పలు సక్సెస్‌ఫుల్ మూవీస్ నిర్మించారు నాగబాబు. ప్రస్తుతం టీవీ షోస్‌తోనూ బిజీగా పయనిస్తున్నారాయన. ఆయనకీ ఒక కొడుకు ఒక కూతురు కాగ ఇద్దరు కూడా సినీ పరిశ్రమ లోనే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో వరుణ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

మెగా బ్రదర్ గానే కాకుండా చిరంజీవి అభిమాన సంఘాలన్నీ ఒక తాటి పైకి తేవడంలో కూడా నాగబాబు పాత్ర ఎనలేనిది. ప్రజారాజ్యం సమయంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నాగబాబు ఇప్పుడు తమ్ముడి జనసేన తరపున ఎన్నికలలో ముఖ్య పాత్ర పోషించేలా ఉన్నారు. మరి పరిశ్రమలో అజాతశత్రువు లాంటి నాగబాబు మా సంఘం అధ్యక్షుడిగా కూడా చేసారు అలాగే ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ మా జన్మదిన శుభాకాంక్షలు.

Tags : Naga Babu, Varun Tej

Write a comment ...
Post comment
Cancel