back

ట్రైలర్ రివ్యూ : F2 - హిట్ ..అంతేగా ..అంతేగా



Share via:

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మేహ్రీన్ మొదలగు భారీ తారాఘనంతో తెరకెక్కిన సినిమా 'F2’ ఫన్ అండ్ ఫ్రష్ట్రేషణ్ . ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమైంది, ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఆ విషయాన్ని కన్ఫాం చేసింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి రివ్యూ చేస్తే...


వెంకీ పెళ్ళిలో పూజారి తాళి బొట్టు చేతికి అందిస్తూ "చివరిగా నవ్వుకొని తాళి కట్టు నాయనా" అనే  పంచ్ ...మరో సందర్భంలో అన్నపూర్ణ వెంకీతో "అట్టా ఏడిపించకపోతే దాని కడుపున ఒక కాయ కాయించొచ్చు కదా" అంటే దానికి సమాధానంగా "24 గంటలూ మీరు నా కొంపలో ఏడుస్తూ కూచుంటే కాయలెక్కడ కాస్తాయి.. నీ తలకాయి".అంటూ వెంకటేష్ పలకించే హావభావాలు మరియు డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్వుకునేలా ఉన్నాయి. ఇక "వెంకీ ఆసన్" కూడా ఆసక్తిని రేకెత్తించేదే. వెంకీ పక్కనే ఉంటూ తెలంగాణ యాసలో మాత్లాడుతూ , వెంకీ తో కలిసి తమ భార్యలు పెట్టె బాధలను తట్టుకుంటూ వరుణ్ తేజ్ కుడా చాల బాగా చేసాడని అనిపిస్తుంది. వీటితో పాటు విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుడా బాగానే ఉంది.

ట్రైలర్: ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ తేజ్, వెంకటేష్

ఈ సంక్రాంతికి తోడల్లుళ్ళు ఇద్దరు హిట్ సౌండ్ ని బలంగా వినిపించేలా ఉన్నారు ,..అంతేగా ... అంతేగా

Tags : F2 Trailer, Venkatesh, Varun Tej

Write a comment ...
Post comment
Cancel