back

వరుణ్ తేజ్ కొత్త సినిమా F2 అప్డేట్ ...



Share via:

దిల్ రాజు నిర్మాణంలో హట్రిక్ విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా “F2”. వెంకటేష్ - వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో వారికి జోడిలగా తమన్నా - మేహ్రిన్ లు నటిస్తున్నారు. ఇటీవల ఈచిత్రం యొక్క భారీ షెడ్యూల్ యూరప్ లోముగిసింది. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ తాజా షెడ్యూల్ కోసం బ్యాంకాక్ కు వెళ్లనున్నారు. అక్టోబర్ 15నుండి అక్కడే జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే షెడ్యూల్ తో ఈ చిత్ర షూటింగ్ పూర్తికానుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

Tags : Varun Tej, Venkatesh, F2, fun and frustration

Write a comment ...
Post comment
Cancel