back

ప్రేగ్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ - వెంకటేష్ !



Share via:

హట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ - విక్టరీ వెంకటేష్ ల తో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా “F2”. ఈ క్రేజీ మల్టిస్టారర్ 'F2' షూటింగ్ ప్రస్తుతం ప్రేగ్ లోని అందమైన లోకేషన్స్ లో జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి లీడ్ హీరో లు వెంకీ - వరుణ్ లతో పాటు హీరోయిన్లు తమన్నా - మెహ్రీన్ లపై పాటను చిత్రీకరిస్తున్నాడు.  ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ఫోటో ను ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజనులతో పంచుకున్నాడు . మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ కి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు.

ఈ ఫోటో చూస్తుంటేనే తెలుస్తుంది ఈ సినిమా షూటింగ్ లో అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక రెండు విజయాలతో ఊపు మీదున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా “అంతరిక్షం” ఈ డిసెంబర్ 21న రిలీజ్ అవ్వనుంది.

Tags : F2 Fun & Frustration Shooting in Prague, Victory Venkatesh, Varun Tej

Write a comment ...
Post comment
Cancel