back

నో ఫైట్స్.. ఓన్లీ కామెడీ అంటున్న F2 టీం



Share via:

దిల్ రాజు నిర్మాణంలో హట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘F2’.

ఈ సినిమా షూటింగ్ మోదులైనప్పటి నుంచి బయటికి వచ్చిన అన్ని ఫోటోస్ లో కుడా సరదాగా ఉన్నాయే తప్పితే మాస్ అండ్ ఫైటింగ్ బ్యాక్ గ్రౌండ్ తో లేవు. ఎందుకంటే అసలు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏమి లేవు! ఇది పూర్తిగా నవ్వులు పండించే కామెడీ సినిమా అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

అనిల్ రావిపూడి ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజ ది గ్రేట్ లలో కామెడీ తో పాటు బీభత్సమైన ఫైట్ సీక్వెన్సులు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఓన్లీ కామెడీ అంటే నమ్మేళ లేదు.

కాని ఈ సినిమా మాత్రం మళ్ళి మనకి మల్లీశ్వరి వెంకటేష్ ని గుర్తుకు తెస్తుంది అనిపిస్తుంది సిని యూనిట్ మాటలని బట్టి. మరి ఇదే టైములో వరుణ్ తేజ్ కూడా వెంకటేష్ తో పోటిగా కామెడీ చేయగలడా అనేది కూడా చూడాలి.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిందని, రేపటి నుండి ఈ చిత్ర ప్రొమోషన్ స్టార్ట్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. దానిలో బాగంగా రేపు ఈ సినిమా గురించి ఓక ఇంట్రస్టింగ్ అప్డేట్ వెలుబడనుంది.

పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ హీరోయిన్లు గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : F2 Fun and Frustration Movie Promotions, Venkatesh, Varun Tej

Write a comment ...
Post comment
Cancel