back

రేపు వైజాగ్ లో వరుణ్-వెంకీల హంగామా..!



Share via:

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తొలి మల్టి-స్టారర్ గా విక్టరీ వెంకటేష్ తో కలిసి తీస్తున్న సినిమా ‘F2’.

వరుసగా మూడు విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి నాలుగో విజయం కోసం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా “F2” ఈ సంక్రాంతి పండగ రిలీజ్ కి సిద్ధం చేసాడు.


దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటకే ఆన్లైన్ లో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ కం ఆడియో వేడుకకు సమయం, ప్రదేశంని ఈ రోజు అనౌన్సు చేసారు.

ఈ నెల 30న ఆదివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్.కె.బీచ్ లో "ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" చిత్ర ఆడియో వేడుక జరగనుంది. దీనికి సినిమా హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, హీరాయింలు తమన్నా, మేహ్రీన్ హాజరుకానున్నారు.

Tags : Venkatesh, Varun Tej, Anil Ravipudi, DIl Raju

Write a comment ...
Post comment
Cancel