back

వినయ విధేయ రామకి ఐటెం గర్ల్ దొరికేసింది



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రానికి ఐటెం గర్ల్ దొరికేసింది. ఈ చిత్రంలోని ఒక స్పెషల్ పాట కోసం బోయపాటి బాలీవుడ్ నుండి ఇంటర్నెట్ సెన్సేషన్ ఈషా గుప్తా ని తీసుకొచ్చాడు.

ఇటివల ఈష వినయ విధేయ రామ మూవీ షూట్ లో తీసిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన ఈ పాట దేవి స్టైల్ లో మాస్ ని మెప్పించేలా ఉంటుంది అని తెలుస్తుంది.


ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట "తందానే తందానే" మంచి ప్రశంసలను అందుకుంది. ఇక ఈ చిత్ర ఆడియో వేడుక తొందర్లోనే జరగనున్నట్టు వినికిడి.

రామ్ చరణ్ సరసన కైరా అద్వాని నటిస్తున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకేక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తప్పకుండా విడుదల చేయ్యనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.


Tags : Ram Charan, Esha Gupta, Vinaya Vidheya Rama

Write a comment ...
Post comment
Cancel