back

కుల ‘వన’భోజనాలకు నా పేరు వాడొద్దు - పవన్ కళ్యాణ్



Share via:

పవన్ కళ్యాణ్ అందరిని ఆశ్చర్య పరుస్తూ తన సామాజిక మాధ్యమాల్లో ఒక విషయం చెప్పారు. "జనసేన నాయకులందరికీ విన్నపం. కార్తీకమాసం వనభోజనాలు మీరు కావాలనుకుంటే వ్యక్తిగతంగా జరుపుకోండి. కానీ నా పేరుమీద కానీ, జనసేన పార్టీ పేరుమీద కానీ జరపవద్దని నా మనవి". అని సూచిస్తూ అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు కార్తీకమాసం శుభాకాంక్షలు చెప్పారు.

కార్తిక మాసం రాగానే రాష్ట్రవ్యాప్తంగా కులాల పేర్లతో జరిగే వన భోజనాల గురించే పవన్ ఈ వ్యాఖ్య చేసారు. ఇప్పటికే “కాపు” ముద్ర పడిన జనసేన పార్టీ తమ ఈ సమయంలో ఈ ముద్రను చెరిపేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న జనసేనానికి ఇప్పుడు కార్తీకమాస వనభోజనాలు పైన ముందుగానే స్పందించారు..

వన భోజనాల పేరుతో జరిగే సామాజిక వర్గాల సమావేశాల్లో పవన్ ఫొటోలు, ఫ్లెక్సీలు పెట్టడం నాలుగైదేళ్లుగా బాగా ఎక్కువైంది. ఇది ఇలాగే కొనసాగితే తను అనుకుంటున్నా కుల రహిత సమాజం ఏమో గాని తననే ఒక కులంకి అంతఘట్టేస్తారని గ్రహించిన పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారని అనుకోవచ్చు.

ఏది ఏమైనా కుల రహిత సమాజం అనే నినాధంకి బలం చేకూరుస్తు పవన్ కళ్యాణ్ ఒక అడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి జనసేన అభిమానులు పవన్ మాటలను సీరియస్ గ తీసుకుంటారో లేదో చూడాలి.

Tags : Caste Feed Dinners, Janasena Party, Pawan Kalyan, Kartika Masam

Write a comment ...
Post comment
Cancel