back

పవన్ కళ్యాణ్ ని కొంత మీడియా బ్యాన్ చేసిందా ?



Share via:

కొద్ది రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిన ఏమి చేసిన చాలా హడావిడి చేసిన మీడియా అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. మంగళగిరి సభ తర్వాత స్వరం మార్చిన కొన్ని మీడియా సంస్థలు ఆ తర్వాత శ్రీ రెడ్డి విషయం లో జరిగిన సంఘటనలు, తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని చానల్లను చూడద్దని అభిమానులకు పిలుపు ఇవ్వడంతో పూర్తిగా మారిపోయాయి.

ఎల్లో మీడియా గా YSRCP వాళ్ళు చెప్పే కొన్ని చానల్స్ అస్సలు జనసేన ప్రోగ్రామ్స్ ని చూపించటం లేదు. మొన్న పవన్ కళ్యాణ్ మొత్తం 175 స్థానాల్లో పోటి చేస్తాం అని చెప్పిన తర్వాత కుడా ఆ చానల్స్ ఏవీ కనీసం చర్చ కూడా పెట్టకపోవడం చూస్తుంటే అవన్నీ అనధికారంగా పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసినట్లే ఉంది.

రాజకీయాల్లో ఇది చాలా ప్రమాదకరం, మరి ఇది ఇంకేనాల్లు సాగుతుందో చూడాలి ?

Tags : Jana Sena Party, Power Star, Pawan Kalyan, Media, News Channels

Write a comment ...
Post comment
Cancel