‘వినయ విధేయ రామ’ పాటలను లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు. ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్-బోయపాటి కాంబోలో మంచి పాటలు విన్న అభిమానులు ఈ ఆల్బమ్ పైన కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అందులోనూ రాంచరణ్ బిగ్గెస్ట్ హిట్ ‘రంగస్థలం’ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటలు ఇవ్వడం అవి ఆ సినిమా ఘనవిజయంలో తమ వంతు పాత్ర పోషించడంలో కీలకంగా మారాయి. అయితే నిన్న రిలీజ్ అయిన వినయ విధేయ రామ పాటలు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచాయి.
మొత్తం ఆరు పాటలలో రెండు పాటలు తప్ప మిగతావన్నీ అంతంత మాత్రమే! ఓవరాల్ గా ఆల్బమ ను చూస్తే గతంలో విన్నట్టుగానే ఉన్నాయిగానీ కొత్తదనం మాత్రం ఏమిలేదు. ఈ మాట అభిమానులందరు అంటున్నారు!
మరి పాటలను చాల గ్రాండ్ గా తీసే బోయపాటి టేకింగ్ మరియు రాంచరణ్ డాన్స్ వల్ల ఈ పాటలు సినిమా రిలీజ్ అయ్యాక ఏమైనా హిట్ అవుతాయేమో చూడాలి.
Tags : Devi Sri Prasad, Ram Charan, Vinaya Vidheya Rama