back

రాంచరణ్ సినిమాకి 50 కోట్లు వద్దన్నా - దానయ్య



Share via:

రాంచరణ్ తో ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకి నిర్మాత డి.వి.వి దానయ్య...
మనం చెప్పుకునేది ఈ సినిమా గురించి కాదు, ఇంకేంటంటే రాజమౌళి తీయబోయే రామచరణ్, ఎన్టిఆర్ ల మల్టిస్తారెర్ కి కూడా దానయ్యే నిర్మాత. గతంలో పలు భారీ చిత్రాలు తీసిన ఓ బడా నిర్మాత దానయ్యకు 50 కోట్ల ఆఫర్ ఇచ్చారట. అంటే ఈ మొత్తం తీసుకుని రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ మూవీని ఆయనకు ఇచ్చేయాలన్నది ఆ ప్రపోజల్ సారాంశంగా చెబుతున్నారు. 200 కోట్లు పెట్టి సినిమా తీసే బదులు స్ట్రెయిట్ గా 50 కోట్లు జేబులో వేసుకుని పక్కకు తప్పుకోవడం అనే ఆప్షన్ ఇవ్వగా .. సినిమా చేసేందుకే మొగ్గారట దానయ్య.

రాంచరణ్ తో ఛాలెంజ్ చేస్తున్న ఎన్టిఆర్

ప్రస్తుతం రాజమౌళికి ఉన్న క్రేజ్ ప్రకారం కనీసం 500-600 కోట్లకు సినిమా అమ్ముకోవచ్చు. అంటే 200 కోట్లు కర్చు కాగా 400 కోట్ల లో నాలుగో వంతు నిర్మాత షేర్ గా వచ్చినా మినిమం 100 కోట్ల ప్రాఫిట్ అన్నమాట. పైగా అన్నిటికీ మించి ఇంతటి క్రేజీ మూవీ తీసిన ప్రొడ్యూసర్ అనే గుర్తింపు ముందు ఈ 50 కోట్లు ఒక లెక్కా చెప్పండి. అందుకే దానయ్య ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడంట ...

రాజమౌళి సినిమాలో పోలీస్ గా రాంచరణ్

Tags : DVV Danayya, RRR Movie, Ram Charan, Rajamouli, NTR

Write a comment ...
Post comment
Cancel