back

ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన ప్రభావం ఎలా ఉంది ..?



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగిన తరువాత స్థాపించిన పార్టీ జనసేన. పోయిన ఎన్నికలలో టిడిపి-బిజెపి పార్టీలకు మద్దతు ఇచ్చిన పవన్, ఆ తరువాత ఆ పార్టీలు అంధ్ర ప్రజలను మోసం చేశాయని పేర్కొంటూ ప్రజలలోకి వచ్చారు. గత సంవత్సర కాలంగా పార్టీ నిర్మాణాన్ని చూసుకుంటేనే, ప్రజా పోరాట యాత్రల పేరు తో ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికలు సమీపించే కొద్దీ బలపడుతూ వస్తుంది. అన్ని మతాలు, కులాలు కలుపుకు పోతున్న పవన్ కి ముఖ్యంగా యువకులలో విపరీతమైన ఆదరణ లబిస్తుంది.


అయితే ఈ మధ్య కొన్ని జాతీయ చానల్స్ చేసిన సర్వే లలో జనసేన గురించి పట్టించుకోకపోవడం, అలాగే విడిసి అనే వారు చేసిన సర్వే లో జనసేన కి కేవలం 5% వోటు షేర్ మాత్రమే ఉందని చెప్పడం చూసే వాళ్లకి విడ్డూరం అనిపిస్తుంది. కాని ప్రస్తుతం ఆంద్ర రాష్ట్రంలో జనసేన ప్రభావం ఎలా ఉంది అనే విషయం లో మేము కొందఱు పాత్రికేయులతో జరిపిన సంభాషణ భావంని మీకు తెలియ చేస్తున్నాం..

“ప్రముఖ న్యూస్ చానల్స్ మరియు వార్త పత్రికలు జనసేన కార్యక్రమాలకు ప్రాముక్యత ఇవ్వకపోయినా కూడా, ప్రజలకి ఏదో ఒక రూపం లో జనసేన తన సిద్ధాంతాలను రాష్ట్ర అన్నిమూలలకు చేరుస్తుంది. ఇందుకు ముఖ్యంగా అభినందనలు తెలపాల్సింది youtube చానల్స్, తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు జనసేన గురించి తెలుపుతున్న పవన్ అభిమానులు మరియు జనసైనికులకు. డబ్బులు పెట్టె ప్రముఖ నాయకులు లేకపోయినా అన్ని నియోజకవర్గాల్లో జనసేన కార్యాలయాలు నడుస్తుండడం, జనసేన ప్రతి కార్యక్రమం జరుగుతుండడం తల పండిన రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. ఇది చూస్తుంటే ఎన్నికల సమయంలోపల జనసేన ప్రజలలో ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టించేలా ఉందని, ఎవ్వరు ఊహించని ఆశ్చర్యకర పలితాలు ఈ ఎన్నికలలో రాబోతున్నాయని పలువురు పాత్రికేయ మిత్రులు అభిప్రాయబడ్డారు.”

అయితే ఈ జనసైనికులకు మార్గనిర్దేశం చేసి ముందుండి సక్రమంగా నడపగలిగే నాయకులకు ప్రతి నియోజకవర్గంలో భాధ్యతలు ఇస్తే పవన్ కళ్యాణ్ కూడా ఊహించని పలితం ఈ రాబోయే ఎన్నికలలో రావచ్చని మేము నమ్ముతూ ..అల్ ది బెస్ట్ జనసేన ..

Tags : JanasenaParty, Pawan Kalyan, AP elections

Write a comment ...
Post comment
Cancel