back

పవన్ చెబుతున్న ప్రతి విషయం నిజమే - సిపిఎం మధు



Share via:

పవన్ కళ్యాణ్ జనసేన తో పాటు రాజకీయ పోరాటాలకు , ఉద్యమాలకు సిద్ధమైన వామపక్షాలు ఆయనకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పైన పూర్తి మద్దతు ప్రకటించాయి. పవన్ మీడియా పైన చేస్తున్న విమర్శలు అన్ని నిజమే అని సిపిఎం మధు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది దొంగ జపం.. దొంగ దీక్ష అని సీపీఎం నాయకుడు మధు విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా కేంద్రంతో చేతులు కలిపిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రత్యేకహోదా నినాదాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిందన్నారు. హోదా కోసం ఉద్యమాలు, బంద్‌లు చేపడితే పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. యువత, విద్యార్థులపై పీడీ యాక్టులతో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

ఈ నెల 16న బంద్‌కు పిలుపునిస్తే.. బంద్‌లు ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తాయి తప్ప, హోదా వస్తుందా అన్నారన్నారు. గతంలో హోదా వద్దని ఇపుడు ఆయనే హోదా కావాలంటారు.. అవిశ్వాసం అవసరం లేదని అవిశ్వాసం పెడతారని మండిపడ్డారు. దీక్షలో టీడీపీ కార్యకర్తలు తప్ప ప్రజల మద్దతు లేదన్నారు. హోదాపై తీర్మానం ఉంటుందన్నారు. ఈనెల 24న హోదా సాధనకోసం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని.. ఆ రోజు బ్లాక్‌డే కూడా పాటిస్తామని మధు స్పష్టం చేశారు. 

Tags : Pawan Kalyan, CPM Madhu, AP Special Status, JanaSena

Write a comment ...
Post comment
Cancel