back

నా పేరు సూర్య పైన కుట్ర జరుగుతోంది - అల్లు అరవింద్



Share via:

ఈ మధ్య ప్రతి సినిమాకి కూడా రిలీజ్ డేట్ కి కొన్ని రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంటూ ఒకటి చేయడం అలవాటు అయిపోయింది. అలాగే నిన్న జరిగిన నా పేరు సూర్య ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ సినిమా పైన నెగటివ్ టాక్ వచ్చేలా కొన్ని కుట్ర పన్నుతున్నారు అని సంచలన వ్యాక్యాలు చేసారు.

‘‘ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఎంతో కొంత మధనపడేలా ఈమధ్య కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాలపై నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన వల్ల కొంతమంది ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని తిప్పికొట్టాల్సింది మీర”ే అంటూ అభిమానులకు సందేశం పంపినారు

తాను ఒక నిర్ణయానికి రావడం వెనుక ఇక్కడి స్క్రీన్ వెనుకే కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయని అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ మాటలను కంటిన్యూ చేస్తూ ‘‘బన్నీ నీకు తరవాత చెబుతాను. నువ్వు దీనికి ఇప్పుడు కనెక్ట్ అవలేవు’’అనే మాట చెప్పారు.



Tags : Allu Arjun, Allu Aravind

Write a comment ...
Post comment
Cancel