back

చిత్రలహరి విజయం తథ్యం - సాయి ధరం తేజ్



Share via:

వరుస పరాజయాలతో కుంగిపోకుండా తన తదుపరి సినిమాతో కచ్చితంగా విజయం సాధిస్థా అంటున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ లో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది.


ఇక తాజాగా సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఒక తండ్రి మరియు నిరుద్యోగ కొడుకు మధ్య జరిగే ఈ కథకు యువత బాగా కనెక్ట్ అవుతారని అన్నారు. అలాగే ఈ సినిమా నన్ను విమర్శించే వారికి జవాబు ఇస్తుందని, ఈ సినిమాతో మళ్ళి హిట్ ట్రాక్ లోకి వస్తానని తేజు అన్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలకానుంది.

Tags : Sai Dharam Tej, Chitralahari

Write a comment ...
Post comment
Cancel