back

విజయం నా జీవితంలో ఎప్పుడొస్తుందో - సాయి ధరంతేజ్



Share via:

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ముందుగా చెప్పినట్లుగానే తన పాత్ర పేరు చెప్పేశాడు. ‘నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడొస్తుందో..’ అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాగా ఆకట్టుకున్నాడు. తాను చేస్తున్న కొత్త సినిమా ‘చిత్రలహరి’ లోని పాత్రలను పరిచయం చేస్తానని ట్వీట్ చేసిన సాయిధరమ్ తేజ్.. కొద్దిసేపటి క్రితం ‘చిత్రలహరి’ టీజర్ ద్వారా చిత్రంలోని పాత్రలను ప్రేక్షకుల ముందుంచాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రలహరి’. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘‘చిత్రలహరి.. అప్పట్లో ఎవ్రీ ఫ్రైడే దూరదర్శన్‌లో వచ్చే ఓ ప్రోగ్రామ్.. ఈ చిత్రలహరి 2019లో ఓ ఫ్రైడే రిలీజ్ కాబోయే సినిమా.. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు’’ అంటూ స్టార్ట్ చేసి ఈ సినిమాలోని పాత్రలన్నింటిని పరిచయం చేశారు. ఎంతో డిఫరెంట్‌గా ఆలోచించి కట్ చేసిన ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : Sai dharam tej, Chitralahari Teaser

Write a comment ...
Post comment
Cancel
sai
2019-03-14 02:28:05

asdfas


Reply
Post comment
Cancel