back

“చిత్రలహరి” లో హీరోయిన్స్ ఎవరంటే..



Share via:

వరుస విజయాలతో ఊపు మీదున్న మైత్రీ మూవీ మేకర్స్ మొన్న దసరా సమయంలో స్టార్ట్ చేసే మరో సినిమానే “చిత్రలాహరి”. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోరే తిరుమల దర్శకత్వంలో రానున్న ఈ సినిమా లీడ్ కాస్ట్ గురించి విషయం బయటికి వచ్చింది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు 'చిత్ర,' మరొకరు 'లహరి'. ఈ సంగతి అలా వుంచితే, సినిమాలో చిత్ర క్యారెక్టర్ కు క'ళ్యాణి ప్రియదర్శిన్' ను తీసుకోగ రెండో క్యారెక్టర్ లహరి కోసం మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్, రోషగాడు సినిమాల్లో నటించిన 'నివేథా పేతురాజ్' ను తీసుకున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమా విజయం ఎంతో అవసరమైన సాయి .. ఈ సినిమా స్క్రిప్ట్ ని మొత్తం పెద్ద మామయ్యా మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడని, ఆయన నుంచి కొన్ని సలహాలు, సూచనలు తీసుకున్నాడు అని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఇలాగైన ఈ సినిమా తో సాయి విజయం సాదిస్తాడేమో చూడాలి.

Tags : Chitralahari, Sai Dharam Tej

Write a comment ...
Post comment
Cancel