back

సాయి ధరం తేజ్ ‘చిత్రలహరి’ - అందరికీ జీవన్మరనమే!



Share via:

ఎంతో మందికి జీవన్మరణ సమస్య లాంటి సినిమాగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘చిత్రలహరి’. ఆ వివరాలు ..

హ్యాట్రిక్ విజయాలతో సుప్రీమ్ హీరో అనిపించుకున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఆ తరువాత వరుసగా ఐదు సినిమాలు సరిగా ఆడకపోవడంతో నిరాశలో కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘చిత్రలహరి’.

సున్నితమైన తండ్రి - కూతురు బందాల మధ్యన ప్రేమ కథని మేళవింపు చేస్తూ అద్భుతమైన సినిమా ‘నేను శైలజ’ విజయంతో ఆరంబించిన సినిమా దర్శకుడు అయిన కిశోర్ తిరుమల తన రెండో సినిమా ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ అనుకున్న విజయాన్ని నమోదు చేయ్యకపోవడంతో మళ్ళి తానెంటో నిరూపించుకోవాల్సిన అవకాశమే ‘చిత్రలహరి’.

చిత్ర కబుర్లుఇద్దరు భామలతో మొదలయిన చిత్రలహరి

తన తొలి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నా కూడా ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో రెండో సినిమాని ఆచితూచి ఎంచుకుని అడుగులు వేస్తున్న మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ అలనాటి హీరోయిన్ లిజి ల కూతురు ‘కళ్యాణి ప్రియదర్శన్’కు కూడా ఈ సినిమా చాల ముఖ్యం.

ఇక అందరి కంటే కూడా నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ కి ఈ సినిమా హిట్ చాల అవసరం. వరుసగా మూడు సినిమాలు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ , రంగస్థలం ఇండస్ట్రీ విజయాలతో ఎక్కడికో వెళ్ళిన బ్యానర్ ఇప్పుడు వరుసగా సవ్యసాచి మరియు అమర్ అక్బర్ అంటోనీ పరాజయాలతో విజయం కోసం ఆతృతలో ఉంది.

మరి ఇంత మంది నమ్మకాన్ని ‘చిత్రలహరి’ నిలబెడుతుందో లేదో చూడాలి.

Tags : Chitralahari, Sai Dharam Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj, Kishore Tirumala

Write a comment ...
Post comment
Cancel