back

దాసరి పై చిరు ఆభిమానం !



Share via:

దర్శకరత్న డా. దాసరి నారాయణరావు’ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో దాసరిగారిని గుర్తుకు తెచ్చుకున్నారు. మెగాస్టార్ దాసరిగారి గురించి ట్వీట్ చేస్తూ.. ‘దా.. దానంలో కర్ణుడు మీరు, స.. సమర్ధతలో అర్జునుడు మీరు, రి.. రిపువర్గమే లేని ధర్మరాజు మీరు, మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మీరే మార్గ దర్శకమవుతారు’ అని ఓ ఫోటోను పోస్ట్ చేసి.. ‘గురువుగారితో ఇది నా చివరి జ్ఞాపకం. మిస్ యు సర్’ అని మెగాస్టార్ దాసరిగారిని అద్భుతంగా వర్ణిస్తూ ట్వీట్ చేశారు.

Tags : chiranjeevi, Megastar, Dasari Narayan Rao

Write a comment ...
Post comment
Cancel