back

బాలకృష్ణ , మోహన్ బాబు, రాంచరణ్ ల గురించి చిరంజీవి మాట ..



Share via:

తన తోటి హీరోలందరితో మంచి అనుభంధం కలిగి ఉన్న మన మెగాస్టార్ చిరంజీవి, మొన్న వైజాగ్ లో జరిగిన టీ.ఎస్.ఆర్. అవార్డ్స్ వేడుకలో అదే విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే ..


వేదిక పైన ఉన్న బాలక్రిష్ణ, నాగార్జున, మోహన్ బాబు ల గురించి చెప్తూ “మా మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని.. మంచి స్నేహితులమేనని  మీకు తెలియజేసేందుకు ఇదొక చక్కని సందేశం కూడా. మా అభిమానులందరూ ఎటువంటి భేదాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేట్లు ఇది దోహదం చేస్తుంది. ఈ రోజు   బాలకృష్ణ, నాగార్జున,  మోహన్ బాబుకి అవార్డు వచ్చింది. నాకు మాత్రం ఏ అవార్డు రాలేదు`` అంటూ చిరు నవ్వేశారు. రామ్ చరణ్ అవార్డులు అందుకొని ఆ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానని అన్నారు. టీఎస్సార్ పిలవడం వల్లనే మేమంతా ఇష్టంతో వచ్చాం. ఓ వేడుకకు మేం అందరం కలిసి రాలేం. ఆ ప్రయత్నం ఎవరూ చేయరు. అది ఒక సుబ్బరామిరెడ్డి వల్లే అవుతుందని పొగడ్తతో ముగించారు చిరు.

ఆ వీడియో మీకోసం  

Tags : MohanBabu, Balakrishna, Ram charan, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel