back

భావితరాలకు స్పూర్తినిచ్చే చిరు సురేఖల 40 ఏళ్ల దాంపత్యం..



Share via:

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వైవాహిక జీవితాలు రకరకాల మలుపులతో సినిమాని తలపించేలా ఉండేవి, ఇప్పటికీ ఉంటున్నాయి. అలాగే జీవితాంతం అన్యోన్యమైన అనుభంధం కలిగిన జంటలు కూడా మనము చూసాము. అలాంటి జంటే మెగాస్టార్ చిరంజీవి - సురేఖలు. మొన్నటితో 40 సంవత్సరాల స్పూర్తిదాయక దాంపత్య జీవితం పూర్తి చేసుకున్న ఈ జంట జీవితం భావితరాలకు స్పూర్తిదాయకం. హీరోగా అప్పుడప్పుడే సినీ కెరర్ ను నెట్టుకు వస్తున్న చిరంజీవిని చూసి అప్పటి స్టార్ కమెడియన్ కం ప్రొడ్యూసర్ అల్లు రామలింగయ్య, చిరంజీవిని సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా తన కూతురును ఇచ్చి పెళ్లి కూడా చేసాడు. చిరంజీవి వ్యక్తిత్వంతో పాటు అతని భావిష్యతుని కూడా అల్లు వారు ముందే ఊహించారు అందుకే కూతురిని ఇచ్చి పెళ్లి చేసాడు అంటారు సినిమా పెద్దలు.

సురేఖ గారు చిరంజీవి జీవితంలో అడుగు పెట్టిన తర్వాత చిరంజీవి జీవితం పూర్తిగా మారిపోయింది. 1980 - ఫిబ్రవరి 20వ తారీకున వీరి వివాహం జరిగింది. ఆ తరువాత చిరంజీవి సినిమాలతో బిజీగా ఉంటే కుటుంబ బాధ్యత మొత్తం తాను చూసుకునే వారు. ఇద్దరు బిడ్డలు - ఒక కొడుకుతో పాటు మరిది పవన్ కళ్యాణ్ ను కూడా తన కొడుకులాగా చూసుకుంటూ కుటుంబంను సురేఖ ఒక చక్కని గృహిణి మాదిరిగా చక్కబెడుతూ వచ్చారు. చిరంజీవి ఇంతటి విజయం వెనుక ఖచ్చితంగా సురేఖ ఉంటారని చెప్పుకోవచ్చు. సురేఖతో వివాహం అయ్యి 40 వసంతాలు పూర్తి చేసుకున్న చిరంజీవి ఆమెతో ఇప్పటికి ఆమెతో కలిసి అన్ని వేడుకలకు హాజారు అవుతూ ఉంటాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినా - సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగినా కూడా ఆయన వెనుక - వెన్నంటి ఉండి ఆయన్ను సురేఖ నడిపించారనడంలో సందేహం లేదు. ఇలాంటి దంపతులు ఇదే విధంగా నిండు నూరేళ్ళు సంపూర్ణ జీవితం అనుభవించాలని కోరుకుందాం.

ఫొటోస్ : చిరంజీవి సురేఖల పెళ్లి ఫోటోలు

Tags : Chiranjeevi, Surekha, Wedding Anniversary

Write a comment ...
Post comment
Cancel