back

షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి



Share via:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే చిత్ర షూటింగ్ కొంత భాగం ముగియగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది . లాక్ డౌన్ సడలింపులు జరిగాక చాల సినిమాలు షూటింగ్ మొదలుపెట్టాయి కానీ కరోనా తీవ్రత అలాగే ఉండడంతో ఇంకొన్ని రోజుల తర్వాత షూటింగ్ మొడులుపెడుదాం అని చిత్ర యూనిట్ భావించింది . ఇపుడిపుడే పరిస్థితులు చక్కపడటం తో ఆచార్య షూటింగ్ పున ప్రారంభించే పనుల్లో ఉన్నారు. మొదటిగా ఇతర నటీనటులతో చిత్రీకరణ మొదలుపెట్టనుండగా చిరంజీవి గారు నవంబర్ 3న షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Tags : Chiranjeevi, Acharya, Ram charan, Kajal Agarwal

Write a comment ...
Post comment
Cancel