back

సిఎం జగన్ తో చిరు భేటీ !!Share via:

ఏపీ సీఏం జ‌గ‌న్ తో టాలీవుడ్ పెద్ద‌లు భేటీ కాబోతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ ను క‌లిసిన చిరంజీవి, నాగార్జున‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌లు, షూటింగ్స్ పై చ‌ర్చించారు. ఇప్పుడు ఏపీ సీఎంతోనూ భేటీ అయి ఇవే స‌మ‌స్య‌ల‌పై ఏపీలో ఇబ్బందులు లేకుండా చూడాల‌ని కోర‌నున్నారు.

తెలంగాణ సీఎంతో స‌మావేశానికి త‌న‌కు ఆహ్వ‌నం లేక‌పోవ‌టంపై నంద‌మూరి బాల‌కృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడం అందరికి తెలిసిందే. ఈ సారి అలాంటి పొర‌పాటు చేయ‌కుండా బాల‌య్య‌కు సైతం ఆహ్వ‌నం పంపించారు.

జ‌గ‌న్ తో స‌మావేశానికి బాల‌య్య‌కు ఆహ్వ‌నం అందినా ఆయ‌న హాజ‌రు కావ‌టం లేదు. ఈ నెల 9న సీఎం జ‌గ‌న్ తో భేటీ ఉంద‌ని, హాజ‌రు కావాల‌ని స‌మాచారం ఇచ్చారు. అయితే… అదే రోజు త‌న పుట్టిన రోజు ఉండ‌టంతో త‌ను రాలేన‌ని బాల‌య్య ప్ర‌క‌టించాడ‌ని తెలుస్తోంది.

Tags : Chiranjeevi, Balakrishna. CM Jagan

Write a comment ...
Post comment
Cancel