back

చిరు 152 లుక్ లీక్Share via:

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ఇందులో చిరు నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి చిరు లుక్ లీక్ అయ్యింది. అందులో ఎర్ర కండువాతో చిరంజీవి లుక్ కేక పుట్టిస్తోంది.

నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. రామ్ చరణ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే భారీ సెట్ వేయగా.. అక్కడే 50రోజుల చిత్రీకరణ జరగనుంది.

Tags : Chiranjeevi, Chiru152, Koratala shiva, Acharya, Ram charan

Write a comment ...
Post comment
Cancel