back

చిరంజీవి నా ఫేవరెట్ - మాళవిక నాయర్



Share via:

మాళవిక నాయర్ ఈ పేరు సిని జనాలకు పెద్దగా గుర్తు ఉండకపోయిన ‘ఎవడే సుబ్రహమణ్యం’సినిమాలో హీరోయిన్ అంటే అందరు గుర్తు పడతారు. మొదటి సినిమాతోనే మంచి నటి అనిపించుకున్న ఈ మలయాళీ మద్దుగుమ్మ తన తర్వాతి సినిమాలుగా నాగ సౌర్య తో చేసిన ‘కళ్యాణ వైభోగం’ అలాగే మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ తో చేసిన ‘విజేత’ సినిమాలు సరిగా ఆడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ రీసెంట్ హిట్ ‘టాక్సివాలా’ లో ఒక ముఖ్య పాత్ర తో మళ్ళి సక్సెస్ బాట పట్టింది. ఈ సందర్బంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి అని చెప్పింది ఈ చిన్నది. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ సినిమాలే తనకి స్ఫూర్తినిచ్చాయి అని చెప్పుకొచ్చింది.

ఎంతైనా స్వయం కృషి తో ఎదిగిన వాళ్ళే ఎప్పటికైనా అందహ్రికి స్ఫూర్తి కాగలరు.

Tags : Megastar Chiranjeevi, Malavika Nair

Write a comment ...
Post comment
Cancel