back

వరద బాధితులకు అండగా చిరంజీవి



Share via:

ఇదివరకెన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చరిత్రలో ఎరగనంత భారీ వర్షాలకు వరదలకు.. రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వేలాది ఇళ్ళు నేలమట్టమయ్యాయి. జనం రోడ్డున పడి పొట్టకూటి కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరాశ్రయుల కోసం ఇప్పటికే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలతో పాటు ఆర్థిక సహాయం అందజేయటం మొదలు పెట్టింది. 550 కోట్ల రూపాయల సహాయ నిధిని వరద బాధితులకు పంపిణీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించటంతో పాటు నిధులు వెంటనే విడుదల చేశారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ వాసులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ముందుకొచ్చారు. వారి వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయటంతో పాటు మిగితా వాళ్ళు కూడా తమకు తోచినంత సహాయం చేయాలని సూచించారు. ఇంకా చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు విరాళాలు అందజేశారు. ఇప్పటికే హైదరాబాద్ ను ఆదుకునేందుకు ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలు విరాళంగా అందజేశాయి. పెద్ద మనసుతో విరాళాలు ప్రకటించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags : Chiranjeevi, Hyderabad Floods, Telangana

Write a comment ...
Post comment
Cancel