back

కేటీర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిరుShare via:

తెలంగాణ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు(కేటీఆర్‌)కు శుక్ర‌వారం(జూలై 24) పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ప‌లువురు అభిమానులు, సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియజేశారు. ‘‘డియ‌ర్ తార‌క్‌.. నువ్వు ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటావు. ఆ విష‌యం నాకు ఎప్పుడూ ఆనందాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌జ‌ల‌ ప్రతి అవసరాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకుని క్షుణ్ణంగా ప‌రిశీలించి సాయం చేయ‌డంలో ముందుంటావు. భ‌విష్య‌త్తులో ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేలా ఆ భ‌గ‌వంతుడు నీకు శ‌క్తిని ప్ర‌సాదించాలి. నీవు చిర‌కాలం సంతోషంగా ఉండాలి’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.