back

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చిత్రం ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిధి



Share via:

'మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం' ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి 'రానున్న చిత్రం. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఈ ఆడియో ఫంక్షన్ మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ "నా స్నేహితుడికి ఆనందం కలిగించడానికి నేను ఇక్కడకు వచ్చాను ఈ రోజు ఇక్కడ ఉండటానికి చాలా సంతోషంగా ఉంది". మూర్తి నాకు 40 ఏళ్ళకు పైగా తెలుసు 1978లో నేను చేస్తున్న సినిమాలో నూతన్ ప్రసాద్‌కి పేపర్ అందించే చిన్న పాత్రలో చేశారు. అప్పుడు ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆ తరువాత మద్రాస్ లో అప్పుడప్పుడూ కలిసే వాళ్ళం. అది ఇప్పటి వరకూ కొనసాగుతోంది.

అప్పటి నుండి ఇప్పటివరకూ నారాయణ మూర్తి ప్యూర్ హార్ట్‌తోనే ఉన్నారు. సినిమాపై ఉన్న ఇష్టమే ఆయన్ని ఈ స్థాయికి చేర్చింది. పీపుల్ స్టార్ అనిపించుకోవడం అంటే చిన్న విషయం కాదు. కమర్షియల్ యాంగిల్‌లో కాకుండా కమ్యునిజం భావజాలంతో సినిమాలకు సాధనంగా ఉపయోగిస్తున్నా. ఆయన సినిమాలో ఎప్పుడూ సందేశాత్మకంగా అభ్యదయ భావాలవైపు అడుగులు వేస్తాయి. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన పంథాలోనూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తులు చాల అరుదు సినిమానే ఆయ‌న పెళ్లి చేసుకున్నారు. సినిమాల‌తోనే ఆయ‌న జీవిస్తున్నారు. `మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం` ఆయ‌న‌కు పెద్ద హిట్ కావాలి` అన్నారు

Tags : R.Narayanamrthy, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel