back

నాగబాబును ప్రశంసించిన చిరంజీవిShare via:

ఇటీవలే కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో గురువారం ప్లాస్మా దానం చేశారు. నాగబాబు ప్లాస్మా దానమును ముందుకు రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా నాగబాబును అభినందించారు.

చిరు ట్వీట్ లో కొవిడ్ తో పోరాడి గెలవడమే కాకుండా ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో ప్లాస్మా డొనేట్ చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు. ఈ సందర్భంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారికి మరోమారు నా విన్నపం, మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ప్లాస్మా డొనేషన్ కు ముందుకు రండి అని. పేర్కొన్నారు.