back

అంతరిక్షం ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరు & పవన్



Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు వరుస విజయాల తరువాత చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం “అంతరిక్షం”. ఘాజి ఫేం సంకల్ప రెడ్డి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి మరియు డైరెక్టర్ క్రిష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతరిక్ష యానంతో పాటు పలు ఆసక్తికర విషయాలను  చిత్రంలో చూపించబోతున్నట్లుగా టీజర్ మరియు పోస్టర్స్ చూస్తుంటే అనిపిస్తోంది. తప్పకుండా ఇదో విభిన్నమైన చిత్రంగా నిలవడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను సినీ యూనిట్ వ్యక్తం చేస్తున్నారు. ‘అంతరిక్షం’ కు భారీ ప్రమోషన్ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.

ఇప్పటికే ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని డిసెంబర్ 9న నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.వీరిద్దరు హాజరు అవ్వనున్న నేపథ్యంలోనే ఇద్దరికి వీలుండేలా కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని మరీ డేట్ ను సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 21 న ఈ సినిమా రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించారు.

Tags : Megastar Chiranjeevi, Antariksham Pre Release, Pawan Kalyan, Varun Tej

Write a comment ...
Post comment
Cancel