back

టాక్సీవాలా చిత్ర యూనిట్ తో చిరంజీవి ..



Share via:

ఈ మధ్య ఈ సినిమా వవిజయం సాధించిన వారిని ఇంటికి పిలిపించి మరీ అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి , నిన్న అదే విధంగా టాక్సీవాలా చిత్ర యూనిట్ ని కూడా తన సత్కరించారు.

ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ తన చిత్రం షూటింగ్ బిజీ కారణంగా చిరంజీవి నివాసానికి రాలేకపోయాడు  కానీ నిర్మాత ఎస్కేయన్, దర్శకుడు రాకుల్ సాంకృత్యాన్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఇలా మిగతా ముఖ్య సభ్యులు అందరూ చిరంజీవిని కలిశారు. సినిమా గురించి చాలాసేపు వారితో ముచ్చటించిన చిరు ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. 

నవంబర్ 17 న రిలీజ్ అయిన 'టాక్సీవాలా' ఇప్పటికే పెట్టుబడికి మూడు రెట్లు రాబట్టింది. సినిమా అన్ కట్ వెర్షన్ పైరసీకి గురయ్యినా ఇలా హిట్ కావడం ఒక ఎత్తైతే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మరీ అందరికీ లాభాలు పంచడం గొప్ప విషయమే. ఇప్పటికే ఆనందంలో తేలియాడుతున్న ఈ సినిమా యూనిట్ కి మెగా ప్రశంశలు ఇంకా బూస్ట్ ఇచ్చి మరో అద్భుత సినిమాకి బాటలు వేస్తుందేమో చూడాలి.

Tags : Chiranjeevi, Taxiwaala

Write a comment ...
Post comment
Cancel