back

చిరంజీవి మణికర్ణిక చూడడానికి కారణం ఏంటి...?



Share via:

మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం కంగనా రౌనత్ నటించిన మణికర్ణిక - ది క్వీన్ అఫ్ ఝాన్సీ సినిమా చూడడానికి మహేష్ బాబు హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన ఏఎంబి సినిమాస్ కి వెళ్లారు. అతనితో పాటు సైరా నరసింహారెడ్డి చిత్ర బృందాన్ని కుడా తన వెంట తీసుకెళ్లారట. పరుచూరి బ్రదర్స్ , ఇతర యువ రచయితలు మరియు సాంకేతిక సిబ్బంది అందరు కలిసి సినిమా వీక్షించారు. అయితే కంగనా రౌనత్ నటన మరియు యాక్షన్ సీన్లు బాగున్నాయని అబిప్రాయపడ్డారట.


చిరంజీవి మణికర్ణిక చూడడానికి కారణం ఏంటి ?

ఎందుకంటే చిరంజీవి కుడా చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు. అయితే మణికర్ణిక లాంటి కథ, కథనంతోనే సైరా సినిమా కూడా రెడీ అవటంతో చిరు ఈ చిత్రం ఎలా చిత్రీకరించారో, తన చిత్రం 'సైరా' తో ఏ విధమైన సారూపత్యం కలిగి ఉందో తెలుసుకోవాలనుకున్నాడు . రెండు సన్నివేశాలు తప్ప ఈ రెండు చిత్రాల మధ్య చాలా తేడా ఉంటుందట.

సైరా నరసింహారెడ్డి చిత్రం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన రాజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో చిరంజీవి ఉయ్యాలవాడ పాత్ర పోషిస్తునాడు.

ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Tags : Chiranjeevi, Syeraa, Kangana, Manikarnika

Write a comment ...
Post comment
Cancel