back

చిరంజీవి విలన్ కొడుకే ఇప్పుడు రాంచరణ్ విలన్ .!



Share via:

తండ్రి కొడుకులు సినిమాల్లో నటించడం మామూలే. ఇద్దరు నటుల పిల్లలు ఒకే సినిమాలో నటించడం అనేది కూడా మాములే. కానీ ఒకప్పుడు తండ్రి హీరో ల విలన్ గా చేసిన అతని కొడుకు ఇప్పుడు కొడుకు సినిమాలో కూడా విలన్ గా చేయడం మాత్రం ఆసక్తికర విషయం. ఇక అసలు విషయం లోకి వస్తే ..

“1988 లో వచ్చిన మరణమృదంగం సినిమాతో చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు మొదలైంది. ఈ మూవీ అప్పట్లో కమర్షియల్ గా పెద్ద హిట్. యండమూరి యాక్షన్ నవలకు కోదండరామి రెడ్డి దర్శకత్వం - ఇళయరాజా సంగీతం తోడై సక్సెస్ ఇచ్చాయి. అందులో విలన్ గా చేసింది సురేష్ ఒబెరాయ్. ఈయన హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ కి తండ్రి. అంటే సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత ఆయన తనయుడు మెగా వారసుడు రామచరణ్ సినిమా ‘వినయ విధేయ రామా’లో విలన్ గా చేయడం కాకతాళీయమే అయినా ఆసక్తికరమే.”

సురేష్ ఒబెరాయ్ మరణమృదంగంలో మాఫియా డాన్ గా నటిస్తే ఇందులో వివేక్ ఒబెరాయ్ ఆయుధాలతో స్మగ్లింగ్ చేసే ఇంటర్నేషనల్ క్రిమినల్ గా నటిస్తున్నట్టు టాక్. పాత్రలు కుడా ఒకేలా ఉండడం, ఇవన్ని చూస్తుంటే ‘వినయ విధేయ రామా’ భారీ హిట్ కొట్టేల ఉంది.

Tags : Ram Charan, Chiranjeevi, Villain

Write a comment ...
Post comment
Cancel