back

చిరంజీవి ఇక కొణిదెలకె పరిమితమా..!



Share via:

దాదాపు 10 సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా “ఖైది నెం 150”, ఆ సినిమా విజయంతో తనకింకా తెలుగు సిని అభిమానుల్లో ఉన్న ఇష్టాన్ని గ్రహించిన చిరంజీవి తరువాతి సినిమాల పైన దృష్టి సారించారు. తను ఎప్పుడో తీయాలని పక్కన పెట్టిన స్వాతంత్ర సమర యోధుడు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” జీవితం ఆధారంగా సైరా సినిమాలో నటిస్తున్నాడు.

చిరు వరుసపెట్టి సినిమాలు తీసే సమయంలో అందరి నిర్మాతలకు సినిమాలు తీసిన వాడే, మరియు నిర్మాత మేలు కోరే హీరోగా చిరుకి మంచి పేరు కూడా ఉంది. తరువాతి కాలంలో సినిమాలు తగ్గించిన చిరంజీవి ఎక్కువగా గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్, అంజనా ప్రొడక్షన్స్ కె సినిమాలు తీసారు. అయితే రీ-ఎంట్రీ లో మొదటి సినిమా ‘ఖైది నెం 150’ ని రామచరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ లో చేసిన చిరంజీవి తర్య్వాతి సినిమాని కూడా అదే బ్యానర్ లో చేస్తున్నాడు.

రీ-ఎంట్రీ సినిమా బాగా రిస్క్ తో కూడుకున్నది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలిదు కనుక సొంతంగా సినిమా తీస్తున్నారు అనుకున్నారు, తరువాత సైరా లాంటి 200 కోట్ల భారీ వ్యయంతో కూడిన సినిమా కూడా రామ్ చరణ్ నిర్మాణంలో తీస్తున్నాడని తెలిసి తన తండ్రి ఋణం తీర్చుకునే ప్రాజెక్ట్ అని అనుకున్నారు. మరి తరువాతి సినిమా కూడా కొణిదెల భాగస్వామ్యంతోనే తీస్తున్నారు అని తెలుస్తుంది. ఎందుకు ఇలా అంటే మనకు వినిపిస్తున్న మాట - సొంతా బ్యానర్ అయితే నిర్మాతకి నష్టం వస్తుంది అనే భయం లేకుండా తన వయుసు, ఆరోగ్యంని ద్రుష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చు అని చిరంజీవి భావించడమే అంటున్నారు. అందుకే ఇక పైన తీసే సినిమాలలో కూడా నిర్మాత ఎవరైనా కొణిదెల బ్యానర్ తో కలిసి సినిమా నిర్మించాల్సిందే అట..!

Tags : Megastar Chiranjeevi, Konidela Productions, Ram Charan

Write a comment ...
Post comment
Cancel