back

చిరంజీవి రిలీజ్ చేయనున్న కృష్ణ అల్లుడి టీజర్ ...



Share via:

చిన్నాపెద్దా తేడాలేకుండా అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చిరంజీవి ఈ మధ్య పలు ఈవెంట్స్ కు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మరో చిన్న సినిమా సమ్మోహనం సినిమా టీజర్ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు చిరంజీవి. అష్ట చెమ్మ ఫేం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం అనే సినిమా తెరకెక్కుతోంది. అదితి రావు హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ను రేపు రిలీజ్ చిరంజీవి చేతులమీదుగా టీజర్ ను ఆవిష్కరించబోతున్నారు. 

ఘట్టమనేని కృష్ణ అల్లుడు అయిన సుధీర్ బాబు ఫంక్షన్లకు సాధారణంగా మహేష్ వస్తుంటాడు. కానీ ఈ హీరో ఫంక్షన్ కు ఓ మెగా హీరో రావడం, అందునా చిరంజీవి లాంటి వ్యక్తి రావడం ఇదే ఫస్ట్ టైం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది సమ్మోహనం సినిమా. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు.

Tags : Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel