back

చిరు - పవన్ మల్టీస్టారర్ పట్టాలెక్కనుందా ..?



Share via:

ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్ అంటూ సీనియర్ నిర్మాత సుబ్బిరామిరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దానిని పట్టుకుని మీడియా నాథ కూడా ఆ స్టోరీ చుట్టే తిరిగింది. తరువాత ఎవరు దాని గురించి మాట్లాడకపోవడం మరియు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో అందరూ దాని గురించి మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ముందుకంటే బలంగా ఆ కలయిక లో వచ్చే సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే…

తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మెగాస్టార్ ఇమేజ్ కి కరెక్టుగా సూటయ్యేలా అయన నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉండేలా ఒక కథ తయారు చేసి అందులో పవన్ కళ్యాణ్ కి కూడా తక్కువ నిడివి ఉండే ముఖ్యమైన పాత్ర తో కథ వినిపించడంతో త్రివిక్రమ్ చిరంజీవి ‘ఒకె’ అని చెప్పారట. ఈ సినిమా చిరంజీవి-కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందట. అంటే 2020 లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి ఈ సినిమాకి నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ ఉంటుందా లేక సుబ్బిరామిరెడ్డి నిర్మిస్తారా అనేది తెలియాలి.

త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథ తయారు చేసే పనిలో ఉన్నాడట. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తాడట. చిరంజీవి-త్రివిక్రమ్ కాంబో అంటే డౌట్ లేకుండా ఒక క్రేజీ ప్రాజెక్టే అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒక ముఖ్య పాత్ర అంటే ఇక మెగా అభిమానులకు పండగే. అంతే కాకుండా మనం సినిమా లో లాగ మెగా ఫామిలీ నటీనటులు అంతా ఏదో ఒక క్యారెక్టర్ తో సినిమాలో పాలు పంచుకుంటే ఇక అది ఒక అద్భుతమనే చెప్పాలి.

Tags : Megastar Chiranjeevi, Pawan Kalyan, Multi Starrer, Trivikram Srinivas

Write a comment ...
Post comment
Cancel