back

అభిమాని కల నెరవేర్చిన చిరంజీవి



Share via:

ఏది ఏమైనా కానీ , ఒకరికొకరు వారి ప్రేమ ఎప్పటికీ మారదు. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రేమను నిరూపించాడు. చిరు తన అభిమాని కుమారుడికి పవన్ శంకర్ అని నామకరణం చేసారు.

అసలు ఈ అభిమాని ఎవరు?

ఈ కథలోకి వెళ్తే , నక్క వెంకటేశ్వరరావు మరియు అతని కుటుంబ సంభ్యులను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు . వెంకటేశ్వర రావు చిరంజీవి వీరాభిమాని అయిన గోదావరి జిల్లాలోని చిన్న గ్రామానికి చెందినవాడు. పార్టీ చురుకుగా ఉన్నప్పుడు ప్రజ రాజ్యం కోసం అతను ఉత్సాహంగా పని చేశాడు. ప్రజా రాజ్యంకు మద్దతుగా ఉనందుకు తాను గ్రామాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. దీని గురించి తెలుసుకున్న చిరు, అతడిని కలుసుకుని 2009 లో ఆర్థికంగా ఆయనకు సహాయపడ్డారు.

వెంకటేశ్వరరావు తన కుమారుడికి చిరంజీవి చేతుల మీదగా నామకరణం చేయించాలని కోరికతో పిల్లాడు పుట్టి సంవత్సరం అయినా ఇప్పటి వరకు పేరు పెట్టలేదు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించి పవన్ శంకర్ అనే పేరు పెట్టాడు. మరోసారి చిరంజీవి అభిమానుల మెగాస్టార్ అనిపించుకున్నాడు.

Tags : Chiranjeevi, Pavan Shankar, VenkateshwarRao

Write a comment ...
Post comment
Cancel