back

చిరు: రాజకీయాలకు ఇక సెలవ్ ..?Share via:

మెగస్టార్ చిరంజీవి 2008 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం. 10 లక్షల పై చిలుకు జన సముద్రం మధ్యన చిరంజీవి ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ, ఆ సభ... దేశవ్యాప్తంగా చర్చనియంశం అయ్యింది. ఒక వైపు అన్నయ్య మరో వైపు యువరాజ్యం అధినేతగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రచారం, 2009 ఎలక్షన్స్ లో ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్, టిడిపిలకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి.

అనుభవరాహిత్యం, రాజకీయం చేయలేకపోవడం, మంచితనం, అందరిని గుడ్డిగా నమ్మడం, ఇంకా ఎన్నో కారణాలతో ప్రజారాజ్యం పార్టీ ఓటమి చవి చూసింది. అయిన 7000000 ఓట్లతో మెగాస్టార్ తన స్టామినాను నిరూపించాడు. తర్వాత జరిగిన రాజకీయ క్రీడలో పావు కాలేక కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేసిన చిరంజీవి, కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా రెండు సంవత్సరాలు పని చేసారు.

ఆ శాఖలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినా కూడా మీడియా సపోర్ట్ లేకపోవడం, సరిగా మార్కెటింగ్ చేసుకోలేకపోవడం, తెలంగాణ సమస్య కారణంగా అవి ఎవ్వరికీ తెలియకుండా పోయాయి. రష్యాలో టూరిజం పెరేడ్, 50 పైన దేశాలకు ఆన్ - అరైవల్ వీసాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టూరిజం అభివృద్ది కోసం 600 కోట్లు పైగానే ఖర్చు చేశారు.

2014 లో రాష్ట్రం విడిపోవడం, దానికి కాంగ్రెస్ ముఖ్య కారణం అవ్వడంతో, ఆంధ్ర రాష్ట్రం లో కాంగ్రెస్ కనుమరుగు అయిపోయింది. ఈ సందర్భంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి మళ్ళి తన 150 సినిమాగా ఖైది నెం 150 తో సిని అభిమానులను అలరించడమే కాక తన స్టామినా తగ్గలేదని నిరూపిస్తూ 100 కోట్ల షేర్ ని కల్లెక్ట్ చేసిన మొదటి హీరోగా (బాహుబలి కాకుండా) రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఒక తెలుగు స్వాతంత్ర సమరయోదిడిగా భారీ తారాగణం మరియు బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు.

కొంత కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న మెగాస్టార్ రాజ్యసభ సభ్యత్యం కూడా ఈ నెలతో ముగుస్తుంది. మరి ఆయన రాజకీయాలలో కొనసాగుతాడ లేదా అనేది ఆయనే చెప్పాలి. మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే చిరంజీవి ఇక రాజకీయ్యాలకు వీడ్కోలు చెప్పినట్లే.....

ఆయన ఏమి చేసిన తనతో పాటే ఉండే అభిమానులు అన్నయ్యకు ఇక ముందు కుడా అండగా ఉంటారు...ఎందుకంటే ఒక్కసారి చిరంజీవి అభిమాని అయితే వాళ్ళు ఎప్పటికీ చిరంజీవి అభిమానులే.....

Tags : Megastar Chiranjeevi Political Career, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel