back

చిరంజీవి - కొరటాల సినిమా టైటిల్ ఏంటంటే ?



Share via:

సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం ఆ సినిమా యూనిట్ అంతా జార్జియా లో కష్టపడుతుండగా, ఇక్కడ చిరంజీవి తర్వాత సినిమా స్టొరీ రెడీ అయిపోతుంది. వరుసగా నాలుగు బ్లాక్-బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివే ఈ సినిమాకి డైరెక్టర్ అలాగే స్క్రిప్ట్ కూడా ముగింపు దశకి వచ్చేసిందని, చిరంజీవి ఇండియాకి రాగానే ఫైనల్ చేస్తామని శివ చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా కథ ఎలా ఉంటుంది, దీని టైటిల్ ఏంటి అనే వాటి పైన కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ మీద సినిమాని నడిపే కొరటాల శివ ఈ సినిమా కథని కూడా అలాగే ప్రస్తుతం దేశంలో రైతుల పరిస్థితి పైన రాసుకున్నాడని అంటున్నారు. సినిమా టైటిల్ కూడా “రైతు” లేక “రైతుబందు” అని అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. మరి ఈ డిసెంబర్ లో మొదలు కానున్న ఈ సినిమా 2019 దసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తాయి.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel