back

చిరంజీవి తో కొరటాల మిర్చి తీయబోతున్నడా ..?



Share via:

ఖైది నెం 150 తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటి, మొదటి స్వాతంత్ర పోరాట యోధుడు తెలుగు వాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఆయన పాత్రే చేస్తూ “సైరా” చిత్రీకరణలో మునిగితేలుతున్న చిరంజీవి తరువాతి సినిమా గురించి అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మొన్ననే రంగస్థలం సినిమా విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి తరువాతి సినిమా అంటూ జరిగిన ప్రచారానికి సుకుమార్ తన తర్వాత సినిమా మహేష్ బాబు తో అని చెప్పి పుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పుడు కొత్తగా కొరటాల శివనే చిరంజీవి తర్వాతి దర్శకుడు అంటూ సిని వర్గాలు చర్చిస్తున్నాయి.

భరత్ అనే నేను తర్వాత పూర్తి కమర్షియల్ సినిమా చేస్తా అని చెప్పిన కొరటాల శివ , హీరో ఎవరు అనేది చెప్పలేదు. శివ తీసిన నాలుగు సినిమాలలో మిర్చి మాత్రమే అన్ని రుచులు కలగలిసిన కమర్షియల్ సినిమా... మొన్ననే చిరంజీవి ఫోన్ చేసి చాల సేపు మాట్లాడి, భరత్ అనే నెను సినిమా గురించి నన్ను అభినందించారు అని శివ చెప్పుకొచ్చారు. రీసెంట్ గా చిరు-కొరటాల మధ్య జరిగిన చర్చల సారాంశo కూడా కొత్త సినిమా గురించేనని తెలుస్తోంది. సైరా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని చిరంజీవి ఫిక్స్ అయిపోయినట్లు మాటలు వినిపిస్తున్నాయి. దీని మీద క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel