back

మరో 'ఠాగూర్' తీయనున్న మెగాస్టార్



Share via:

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహరెడ్డి చిత్రం తరువాత తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు... ఈ చిత్ర కథ పై కొన్ని వార్తలు నేట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

మెగాస్టార్ - కొరటాల చిత్రం 'ఠాగూర్' లాంటి కథతో తెరకేక్కుతున్నట్టు తెలుగు ఫిలిం నగర్ లో టాక్. కొరటాల, చిరు కోసం ఒక అద్బుతమైన ఠాగూర్ లాంటి సందేశాత్మక చిత్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ పై చాల హార్డ్ వర్క్ చేస్తున్నాడట.


15 సంవత్సరాల క్రితం వచ్చిన ఠాగూర్ సినిమా అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఆ చిత్ర చిరంజీవికి ఒక అద్బుత ఘన విజయాన్ని అందించింది.

మల్లి ఇన్నేళ్ళ తర్వాత కొరటాల శివ కూడా అలాంటి ఒక కథనే తీర్చిదిద్దుతున్నాడని తెలియడంతో చిరు అభిమానులు ఎంతో ఆనందంతో ఉన్నారంట.


మరి ఈ సినిమా కథ గురించి ఇంకా లోతైన విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva, Tagore

Write a comment ...
Post comment
Cancel